మురికివాడలు లేని మహానగరం చేస్తా:కేటీఆర్

226
Double bed room in one year
Double bed room in one year
- Advertisement -

డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ ప‌థ‌కం సీఎం కేసీఆర్ మాన‌స‌పుత్రిక అని మంత్రి కేటీఆర్‌ అభివ‌ర్ణించారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్ గిరిలోని రాంప‌ల్లిలో 6 వేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల‌కు మంత్రి కేటీఆర్ ఇవాళ శంకుస్థాప‌న చేశారు.

ktr31081

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఏ రాష్ట్రం, ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని ఆలోచ‌న సీఎం కేసీఆర్ చేశార‌న్నారు. పేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌తికేందుకే అన్ని వ‌స‌తుల‌తో డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ఉచితంగా నిర్మించి ఇస్తున్న‌మ‌న్నారు. హైద‌రాబాద్ లో ఒక్కొక్క ఇంటికి అవుతున్న ఖ‌ర్చు 8 ల‌క్ష‌ల 65 వేలు అని అన్నారు. మార్కెట్ లో ఆ ఇంటి ధ‌ర 30 ల‌క్ష‌ల‌కు పైనే ఉంటుంద‌న్నారు. మొత్తం 18 వేల కోట్ల‌తో 2 లక్ష‌ల 65 వేల డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామ‌న్నారు.

2018 దసరా నాటికి ఇళ్లు నిర్మించి ఇస్తామని కేటీఆర్ అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రం చేప‌ట్ట‌ని విధంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇండ్లు క‌ట్టించి ఇస్తున్న‌ద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, ఎంపీ మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -