అల్లర్లలో ఇరుక్కున్న అలియా భట్‌..

199
- Advertisement -

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను అరెస్ట్ చేసిన రోజు నుంచి హర్యానా అంతా అల్లర్లతో అట్టుడుకుతుండగా.. డేరా అనుచరుల విధ్వంసాలు ఇంకా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఉదంతంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మాత్రం హర్యానాలో ఇరుక్కుపోయింది. అలియా భట్ ప్రధాన పాత్రలో రాజీ అనే సినిమాను మేఘనా గుల్జార్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్ సరసన విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. కాగా, హరీందర్ సిక్కా రాసిన నవల ‘సెహ్మత్’ ఆధారంగా ఈ ‘రాజీ’ చిత్రం తెరకెక్కుతోంది.

Shooting of Alia Bhatt's Raazi halted amidst tension in Punjab

ఈ నేపథ్యంలో నేటివిటీ కోసం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పంజాబ్ లోని పటియాలాలో పెట్టుకున్నారు. అయితే గత 25న డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ కు అత్యాచారం కేసులో శిక్ష పడింది. ఆ సమయంలో ఈ చిత్ర యూనిట్ షూటింగ్ లో ఉంది. అప్పటికే పోలీసుల హెచ్చరికలు, మీడియాలో వార్తలు చూడడంతో చిత్ర యూనిట్ షూటింగ్ రద్దు చేసుకోని హోటల్ రూంకు చేరిపోయారు. దీంతో ఆలియా భట్ హోటల్ రూమ్ కే పరిమితమైంది. బయటకు వచ్చేందుకు కూడా సాహసం చేయడం లేదు.

దాదాపు వారం రోజుల నుంచి అక్కడే ఉంటున్న ఆలియా అండ్ కో తిరిగి షూటింగ్ ప్రారంభించడంపై చర్చలు నిర్వహిస్తున్నారు. నిజానికి సెప్టెంబర్ 10 వరకూ వీరి షెడ్యూల్ పటియాలా లోనే జరగాల్సి ఉంది. ఆ తర్వాత చండీఘడ్ వెళ్లి ఓ నెల రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉండగా చివరి షెడ్యూల్ ను ముంబైలో ప్లాన్ చేసుకున్నారు.

- Advertisement -