యంగ్‌ టైగర్‌పై నాగ్‌ కామెంట్‌…

187
Nagarjuna Shocking Comments On Ntr
- Advertisement -

తెలుగులో బిగ్‌బాస్‌షో ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షోలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తనదైన స్టైల్ లో షోని సక్సెస్‌ చేస్తున్నాడంటూ పలువురు స్టార్లు వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా కింగ్ నాగార్జునా కూడా ఎన్టీఆర్‌ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.

సినిమా కోసం తెరపై నటించడం వేరు .. టీవీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించడం వేరు అన్నారు నాగార్జున. కథానాయకుడిగా ఎన్నో సినిమాలు చేసిన నాగార్జున, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు‌. అందువలన టీవీ వ్యాఖ్యాతగా ప్రేక్షకులను మెప్పించడం ఎంత కష్టమన్నది తనకి తెలుసునని నాగార్జున అన్నారు.
 Nagarjuna Shocking Comments On Ntrతాను ‘బిగ్ బాస్’ షో చూస్తున్నాననీ, ఎన్టీఆర్ చాలా బాగా చేస్తున్నాడని చెప్పారు. ఎన్టీఆర్ బయట ఎంత ఎనర్జీతో ఉంటాడో .. బుల్లితెరపై కూడా అంతే ఎనర్జీతో కనిపిస్తున్నాడని అన్నారు.

ఎంతో కష్టమైన పనిని ఎన్టీఆర్ తనదైన స్టైల్లో అవలీలగా చేస్తుండటం తనకి ఆనందాశ్చర్యాలను కలిగిస్తోందని చెప్పారు. ఎంతో సమయస్ఫూర్తితో .. సమర్థతతో ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తోన్న తీరు అభినందనీయం అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు.

- Advertisement -