జగన్‌ని ప్రజలు తిరస్కరించారు…

222
TDP Wins By 27,000 Votes In Nandyal By-Poll
- Advertisement -

ఏపీలో ఉత్కంఠ రేపిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని  భారీ మెజార్జీతో గెలిపించారు. 27,466 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. టీడీపీకి 56 శాతం ఓట్లు రాగా.. వైకాపాకు 40 శాతం ఓట్లు వచ్చాయి.  టీడీపీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలిపోయాయి.

నంద్యాల ఉప ఎన్నికలో  భూమా బ్రహ్మానందరెడ్డి అపూర్వ విజయం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు టీడీపీని ఆదరించారని.. ఈ విజయం అభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమానికి నంద్యాల ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. నంద్యాలలో జగన్‌ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని…సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు.టీడీపీని శాశ్వతంగా అధికారంలో ఉండేలా చేస్తామన్నారు.

నంద్యాల ఉపఎన్నిక‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఎన్డీయేకు ఎంతో విలువైన మ‌ద్దతుదారు టీడీపీ త‌ర‌ఫున‌ నంద్యాలలో ఘ‌న‌విజ‌యం సాధించినందుకు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి గారికి నా కృత‌జ్ఞ‌త‌లు  అంటూ ప్ర‌ధాని ట్వీట్ చేశారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీన‌టుడు బాల‌కృష్ణ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. భూమా బ్రహ్మానంద‌రెడ్డికి అభినంద‌న‌లు తెలిపిన బాలయ్య…. అభివృద్ధి కోసం కృషి చేస్తోన్న త‌మ పార్టీకి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎప్ప‌టికీ ఉంటుంద‌ని తెలిపారు.

- Advertisement -