టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా రేంజ్ బాహుబలి సిరీస్ తో అనూహ్యంగా మారిపోయిందని అనడంలో సందేహం లేదు. ఆ చిత్రం దేశవ్యాప్తంగానే కాదు.. అంతర్జాతీయంగా కూడా భారీ సక్సెస్ సాధించడంతో.. బాలీవుడ్ నుంచి రానాకు బోలెడన్ని ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. ఓ హాలీవుడ్ మూవీ కోసం కూడా రానా చర్చలు జరుపుతున్నాడనే టాక్ కూడా ఉంది.
అయితే.. బాలీవుడ్ నుంచి బడా సినిమాల కోసం వరుసగా ఆఫర్స్ వస్తుండడంతో.. టాలీవుడ్ ను వదిలేసే యోచనలో రానా ఉన్నాడనే టాక్ ఈ మధ్య వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత.. హాలీవుడ్ లో సెటిల్ అయిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని అంటున్నారు. అందుకే కొత్త సినిమాలను యాక్సెప్ట్ చేయడం లేదనే టాక్ కూడా ఉంది.
అయితే.. ఇదంతా ఒట్టి రూమర్ మాత్రమేనని తేల్చేశాడు రానా. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టాలీవుడ్ ను వదిలే ప్రసక్తే లేదని చెప్పడం విశేషం. తాను నేషనల్ మూవీస్ మాత్రమే కాదు.. ఇంటర్నేషనల్ సినిమాలు చేసినా సరే.. టాలీవుడ్ నుంచి వచ్చే ఆఫర్స్ ను ఏ మాత్రం చిన్నచూపు చూడనంటున్నాడు రానా. రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి అంటూ సోలో హీరోగా తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రానాతో మూవీ చేసేందుకు ఇప్పుడు దర్శక నిర్మాతలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు.