బాలయ్యకు తల్లిగా నయన్‌…

306
- Advertisement -

అందాలతార నయనతార లేడీ ఓరియంటేడ్ సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మాత్రం అడపదడపా సినిమాలు చేస్తోంది. వెంకటేష్ తో ‘బాబు బంగారం’ తర్వాత తెలుగులో బాలయ్యతో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నయన్. ‘సింహా, శ్రీరామరాజ్యం ‘తర్వాత బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి కె.యస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాలయ్యకు 102వ సినిమా కానుంది.

అయితే మూడోసారి బాలయ్య సరసన నయనతార నటిస్తుందని ఆశపడ్డ నందమూరి అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. బాలకృష్ణ 102వ సినిమాలో నయనతార లీడ్ హీరోయిన్ గా ఎంపికైందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయన్ హీరోయిన్ కాదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Nayanatara's look in NBK's 102 Movie

ఈ సినిమాలో ఓ కీలక పాత్రకి భార్యగా నయన్ నటిస్తుందని అంతేకాదు బాలయ్యకి తల్లిగా నయన్ నటిస్తుందనే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ మధ్య విపరీతంగా వినిపిస్తుంది. గతంలో బాలకృష్ణ 100వ సినిమాకు నయనతారను ఎంపిక చేసుకోవడానికి క్రిష్ అండ్ టీమ్ ప్రయత్నించారు కానీ అప్పుడు ఆమె కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేయలేకోపోయింది. ఇప్పుడు ఓ గెస్ట్ రోల్ కోసం నయన తన టైమ్ ఇచ్చిందంటేనే సినిమాలో ఏదో కొత్త పాయింట్ ఉందేమో అనే సందేహాలు సినీ జనాలకు వస్తున్నాయి. మరో వైపున చిరంజీవి 151లో నయన్ హీరోయిన్ గా బుక్ అయిందనే టాక్ నడుస్తుంది. అయితే అది ఫుల్ లెంత్ పాత్రేనా లేక బాలయ్య సినిమా మాదిరిగా ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనే డిస్కషన్స్ నడస్తున్నాయి. మరి బాలకృష్ణకి తల్లిగా అలానే చిరు అప్ కమింగ్ మూవీలో నయన్ ఎలా కనిపిస్తుందో చూడాలి మరి.

- Advertisement -