ఆ ఇద్దరికి.. చెరో 5 కోట్లు..

345
- Advertisement -

రానా, తేజాల కలయికలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా నడుస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లోను డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన మొత్తాన్ని వెనక్కి తెచ్చి లాభాల్లోకి కూడా తీసుకెళుతోంది.

ఈ సినిమాతో తేజ మరోసారి వెలుగులోకి రాగా రానాకు సోలో హీరోగా భారీ విజయం దక్కింది. దాదాపు 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారట. కథా .. కథనాలు .. రానా పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.

 rana and teja get 5 crores

దాంతో విడుదలైన అన్ని ప్రాంతాల్లోను ఈ సినిమా విజయవిహారం చేసేసింది. అంచనాలకి మించి భారీ వసూళ్లను రాబట్టేసింది. దాంతో ఈ సినిమాకి 25 కోట్ల వరకూ లాభాలు వచ్చాయని తెలుస్తోంది.

ముందుగా అనుకున్న ప్రకారం లాభాల్లో వాటాగా దర్శకుడు తేజకు .. హీరో రానాకు చెరో 5 కోట్లు వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. లాభాల్లో వాటా సంగతి అటుంచితే తేజ .. రానాల కెరియర్లో ఒక వైవిధ్యభరితమైన చిత్రంగా ‘నేనే రాజు నేనే మంత్రి’ నిలిచిపోవడం విశేషం.

- Advertisement -