శర్వానంద్‌….మహానుభావుడే

236
Mahanubhavudu Official Teaser
- Advertisement -

శతమానంభవతి హిట్ తర్వాత శర్వానంద్ నటిస్తున్న చిత్రం మహానుభావుడు. భలే భేలే మగాడివోయ్ ఫేం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శర్వానంద్ సరసన కృష్ణగాడి వీర ప్రేమకథ భామ మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుండగా రేపు వినాయక చవితిని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. టీజర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు శర్వా.

టీజర్‌లో శర్వానంద్‌..‘నా పేరు ఆనంద్‌. నాకు ఓసీడీ ఉంది. అంటే అదేదో బీటెక్‌, డిగ్రీలాంటిది కాదు. డిజార్డర్‌. దీని లక్షణాలు అతిశుభ్రం’అని చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఇందులో శర్వానంద్‌కి ఎంతశుభ్రత అంటే.. బాస్‌ తుమ్ముతుంటే పరిగెత్తుకుంటూ వెళ్లి తన సీటులోకూర్చుంటాడు. ఆఖరికి హీరోయిన్‌ని ముద్దుపెట్టుకోవాలన్నా ఆమెని పళ్లు తోముకున్నావా అని అడుగుతాడు.

‘నువ్వు మహానుభావుడవేరా..’ అన్న బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలైట్‌గా నిలిచింది. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌ థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

- Advertisement -