లగ్జరీ స్పోర్ట్స్ కారంటే లంబోర్గిని.. ఆ కారు ఎంత విలాసవంతంగా ఉంటుందో తెలిసిందే. తాజాగా లంబోర్గిని గ్లోబల్‌గా మొబైల్ మార్కెట్లోనూ అడుగుపెట్టింది. ఇటలీకి చెందిన లంబోర్గిని.. తమ బ్రాండ్‌కు తగ్గట్టు మరో లగ్జరీ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఓ కొత్త సూపర్ లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌ను లంబోర్గిని లాంచ్ చేసింది. ఆల్ఫా-వన్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర సుమారు 1.57 లక్షల రూపాయలు(2450 డాలర్లు). ఈ ధరల్లోనే వ్యాట్ ఛార్జీలు కూడా కలిసి ఉన్నాయి. అదనపు కస్టమ్స్ పన్నులను ఇక కొనుగోలుదారులే భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్కెట్లోకి వచ్చింది.
లంబోర్గిని తన సూపర్ కార్లలో వాడే డెంట్ రెసిస్టెంట్ లిక్విడ్ అలోయ్‌తో ఆల్ఫా-వన్ను రూపొందించింది. టైటానియం కంటే అలోయ్ ఎక్కువ మన్నికమైంది. ఫోన్ వెనుక భాగాన్ని ఐరన్‌తో కాకుండా.. ఇటాలియన్ బ్లాక్ లెదర్‌తో తయారుచేశారు. దీంతో పాటు కంపెనీ లోగోను కూడా ముద్రించారు. ఫోన్‌తో పాటు ఇటాలియన్ లెదర్ ఫోన్ కేస్ కూడా వస్తుంది. ఆండ్రాయిడ్ నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్లో అన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
ఆల్ఫా వన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు…
క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్
4జీబీ ర్యామ్
5.5 అంగుళాల 2కే అమోలెడ్ డిస్ప్లే
2560×1440 పిక్సెల్ రెజుల్యూషన్
20మెగాపిక్సెల్ వెనుక కెమెరా
8మెగాపిక్సెల్ ముందు కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్