తెలుగు, తమిళ, మళయాల చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియమణి పెళ్లి పీటలు ఎక్కింది. కొద్ది రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ తో ఎంగెజ్ మెంట్ జరుపుకున్న ప్రియమణి ఆగస్టు 23 న వివాహం చేసుకుంది. ఈ వివాహాన్ని సింపుల్ గా రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుపుకుంది. అయితే వీరి రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా స్టార్ హోటల్ లో ఇస్తారని టాక్. ప్రియమణి, ముస్తఫా రాజ్ తోలిసారి ఓ షో లో కలిసారట, ఆ పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బందంతో ఒక్కటయ్యారు. బెంగళూర్ లో సాయంత్రం 7గం.ల నుండి జరగనున్న రిసెప్షన్ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు కూడా హాజరు కానున్నట్టు సమాచారం.
పెళ్ళికి ముందు రోజు ప్రియమణి ఇంట మెహందీ మరియు సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక రిసెప్షన్ తర్వాత మరో రెండు రోజులలో ఈ అమ్మడు షూటింగ్ కి వెళ్ళనుంది. ప్రస్తుతం మలయాళంలో ‘సైలంట్ రేడియో’, ‘పెర్ఫ్యూమ్’, ‘యస్ ఐ యామ్’, ‘పెయింటింగ్ లైఫ్’, ‘గ్రాండ్ మాస్టర్ 2’, ‘సత్యాన్వేషణ పరీకణగళ్’ సినిమాలతో బిజీగా ఉంది. ప్రియమణి ప్రేమాయణం ఓ డ్యాన్స్ షో ద్వారా సాగిన సంగతి తెలిసిందే. ముస్తఫాను తొలిసారిగా ఓ డ్యాన్స్ షోలో కలిసిన ఈ అమ్మడు.. ఆ పరిచయాన్ని ప్రేమగా, ఆ తర్వాత వివాహం గా మార్చుకున్న సంగతి తెలిసిందే.