పీవీఆర్కే ప్రసాద్ మృతి…

198
PVRK Prasad is dead
- Advertisement -

మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో, ప్రముఖ రచయిత పీవీఆర్కే ప్రసాద్ నేడు (సోమవారం ) తెల్లవారుజామున కన్నుమూశారు. 77 యేళ్ల వయసున్న ఆయన అనారోగ్యంతో హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు కూడా సోమవారమే పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.

మాజీ ప్రధానమంత్రి నరసింహారావుకు మీడియా సలహాదారునిగా కూడా కొనసాగారు పీవీఆర్కే. అంతేకాకుండా, బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ రాజీనామా తదితర విషయాలను వివరిస్తూ ‘అసలేం జరిగిందంటే’ పేరిట యధార్థ సంఘటనలతో ఓ పుస్తకం రాయగా, అది సంచలనం సృష్టించింది. ఇంకా ‘కర్త అతడే’, ‘తిరుమల చరితామృతం’, ‘తిరుమల లీలామృతం’.. వంటి పుస్తకాలు కూడా రాశారు పీవీఆర్కే ప్రసాద్ .

పీవీఆర్‌కే ప్రసాద్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విపక్ష నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. పీవీఆర్‌కే ప్రసాద్‌ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సలహాదారుగా సుదీర్ఘకాలం పనిచేశారు. అలాగే తిరుమల ప్రాశస్త్యంపై ఆయన పలు పుస్తకాలు రాశారు. పీవీఆర్‌కే‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

- Advertisement -