హీరోయిన్ ప్రియమణి ఈ నెల 23న తన ప్రియుడు ముస్తఫా రాజ్‌ను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రియమణి ఆడంబరంగా కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనుందట. తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించిన ప్రియమణి.. తాను రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నానన్న విషయాన్ని చెప్పింది. తన పెళ్లి గురించి ఆ తరువాత తన ప్లాన్స్ గురించి సౌత్ బ్యూటీ ప్రియమణి ఏమంటోందంటే.. “మేము రిజిస్టర్ పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం ఉంది. మా ఇద్దరి మతాలు ఒక్కటి కావు. రెండు వేరు వేరు పద్దతులలో పెళ్లి చేసుకోవడం కన్నా ఈ రిజిస్టర్ పెళ్లి బెటర్ అనిపించింది.
ముస్తఫా నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. పెళ్ళైన మరుసటి రోజే గ్రాండ్ గా ఒక రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశాము నా ఫిల్మ్ ఫ్రెండ్స్ కోసం అతని ఫ్రెండ్స్ కోసం” అని చెప్పింది. అలా చెబుతూనే నేను పెళ్ళైన రెండో రోజు నుండే సినిమా షూటింగ్లతో బిజీ అవ్వబోతున్నా అని కూడా అంటోంది. ఎందుకంటే నేను ఇదివరికే ఒప్పుకున్న సినిమాలు ఇంకా పూర్తి చేయవలిసినవి ఉన్నాయి. పెళ్లి తరువాత కూడా నేను సినిమాలలో నటిస్తాను అని చెప్పింది.
ఇక ప్రియమణి ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ 2 అనే ఒక మలయాళం సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే కొన్ని కన్నడ సినిమాలలో కూడా హీరోయిన్ గా కనబడనుంది. ఇప్పుడు తెలుగులో ఏ సినిమాలు చేయకపోయినా కూడా ఒక టివి డాన్స్ షో కి జడ్జ్ గా చేస్తోంది.