ట్వింకిల్ ఎంత పని చేసింది…

205
Twinkle Khanna reveals the hilarious first scene of &lsquo
- Advertisement -

ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్‌’ క్యాంపెయిన్‌ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘టాయ్‌లెట్ -ఎక్ ప్రేమ్‌కథ’ మౌనాన్ని ఛేదించే ప్రయత్నంలో భాగంగాఈ సినిమా చేశారు బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్‌. పూర్తి సందేశాత్మ‌క చిత్రంగానే కాక వినోదోత్మ‌కంగా ఈ మూవీ ఉండ‌డంతో ప్రేక్ష‌కులు ఈ సినిమాకి నీరాజ‌నాలు ప‌లికారు. ప్ర‌స్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది.

ఈ చిత్రాన్ని స్పూర్తిగా తీసుకొని కొంద‌రు టాయిలెట్స్ కూడా నిర్మించుకున్నారు . ఇలాంటి మంచి చిత్రం తీసిన టాయ్‌లెట్ -ఎక్ ప్రేమ్‌కథ చిత్ర యూనిట్ అంద‌రికి ప్ర‌ధాని మోదీ అభినంద‌నలు తెలియ‌జేశారు.

 Twinkle Khanna reveals the hilarious first scene of ‘Toilet: Ek .

క‌ట్ చేస్తే అక్ష‌య్ భార్య ట్వింకిల్ ఖ‌న్నా స‌ముద్రం ఒడ్డున బ‌హిర్భూమికి వెళుతున్న వ్య‌క్తిని త‌న కెమెరాలో బంధించి ఆ ఫోటోని సోష‌ల్ మీడియాలో లీక్‌ చేసేసింది.

అంతేకాకుండా టాయ్‌లెట్ -ఎక్ ప్రేమ్‌కథ చిత్రం పార్ట్ 2లో తొలి సీన్ ఇక్క‌డ‌దే అయి ఉండొచ్చు అనే కామెంట్ కూడా పెట్టింది. అంటే తన దృష్టిలో టాయ్‌లెట్ .. ఎక్ ప్రేమ్‌కథకి సీక్వెల్ తీసి ప్ర‌జ‌ల‌లో మ‌రికొంత చైత‌న్యం తేవాల‌ని ఆమె కోరుకుంటుందేమో మరి.

- Advertisement -