చరిత్రాత్మక మ్యాచ్‌కి వర్షం అడ్డంకి

252
- Advertisement -

కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకి వరణుడు అడ్డంకిగా మారాడు. ఆటముగిసే సమయానికి 47 ఓవర్లలో న్యూజిలాండ్ 152/1 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. ఓపెనర్ గుప్టిల్ 21 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగిన..మరో వికెట్ పడకుండా కెప్టెన్ విలియమ్‌ సన్,లతమ్‌ జాగ్రత్తగా ఆడి కీవిస్‌ని పటిష్ట స్థితికి చేర్చారు. హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. లతమ్ 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా…విలియమ్ సన్ 65 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ బౌలర్లలో ఉమేష్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.

india

అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 291/9తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ 318 పరుగులకు ఆలౌటూంది. జడేజా (42 నాటౌట్‌: 44 బంతుల్లో 7×4, 1×6) దూకుడుగా ఆడటంతో అలవోకగా 300 పరుగుల మైలురాయిని అందుకోగలిగింది. అయితే జడేజాకు సహకారం అందించిన టెయిలెండర్‌ ఉమేశ్‌ యాదవ్‌ (9: 27 బంతుల్లో 2×4) వికెట్‌ కాపాడుకుంటూ కొద్దిసేపు క్రీజులో నిలిచినా.. జట్టు స్కోరు 318 వద్ద వాగ్నర్‌ విసిరిన షార్ట్‌ బంతికి ఔటయ్యాడు. బంతిని ప్లిక్‌ చేయబోయిన ఉమేశ్‌ యాదవ్‌ కీపర్‌ వాట్లింగ్‌కు సునాయాస క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. కీవిస్ బౌలర్లలో బోల్ట్ 3,వాగ్నర్ 2,సాంటర్ 3,క్రెయిగ్,సోది తలో వికెట్ పడగొట్టారు.

jadeja

- Advertisement -