బాహుబలితో రాజమౌళి సుడి మరింత తిరిగింది. ప్రపంచ సినీ అభిమానులను తెలుగు సినీ పరిశ్రమ వైపు చూసేలా చేసిన రాజమౌళితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.నిన్నమొన్నటివరకు రాజమౌళి సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించిన వారంతా… ఇప్పుడు ఛాన్స్ దొరికితే జక్కన్న డైరెక్షన్ లో నటించాలని కుతుహలంతో వెయిట్ చేస్తున్నారు. అంతేగాదు పలు బడా చిత్ర నిర్మాణ సంస్థలు సైతం రాజమౌళిపై కన్నేసాయి.
బాహుబలి చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించి ప్రేక్షకుల మదిలో మరిచిపోలేని తీపి జ్ఞాపకాలను ముద్రించాడు జక్కన్న. ప్రస్తుతం ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలన్నీ బాహుబలిని టార్గెట్ గా చేసుకొని తెరకెక్కుతున్నాయి. కనీసం ఆ రేంజ్ లో కాక పోయిన కొంత వరకు అయిన ఆ సినిమా స్థాయిని అందుకోవాలని భారీ ఖర్చుతో తమ సినిమాలను తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు.
అయితే బాహుబలి 2 చిత్రం విడుదలైన తర్వాత ఇటు స్టార్ హీరోలు కాని అటు యంగ్ హీరోలు కాని తమ సినిమాలతో అక్కడి ఆడియన్స్ ని ఏ మాత్రం మెప్పించలేకపోతున్నారట. ట్యూబ్ లైట్, జబ్ హ్యరీ మెట్ సెజల్, రాబ్తా, జగ్గా జాసూస్, హాఫ్ గాల్ ఫ్రెండ్, మున్నా మైఖేల్, సర్కార్ 3 ఇలా ఎన్నో సినిమాలు భారీ అంచనాలతో విడుదలైనప్పటికి అవి ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాయి. దీంతో అభిమానులే కాదు అక్కడి మీడియా కూడా రాజమౌళి ని కారణంగా చూపిస్తూ బాలీవుడ్ హీరోలు, దర్శకులపై పెదవి విరుస్తుంది. సౌత్ దర్శకుడు సాధించిన ఫీట్ ని మన వాళ్ళు ఎందుకు అందుకోలేకపోతున్నారంటూ బాలీవుడ్ మీడియా ఫైర్ అవుతుందట.