రూ. 126 కోట్లతో బాసర ఆలయ అభివృద్ధి

147
- Advertisement -

ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసర సరస్వతిదేవి ఆలయ అభివృద్ధికి రూ 126 కోట్లుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

ఆదివారం తెలంగాణ జాగృతి బాసర లో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత సరస్వతి దేవి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

 MP Kavitha Participates In Kavi Sammelanam At Nizamabad .

అనంతరం మీడియా తో మాట్లాడుతూ, తెలంగాణ లోని అన్ని దేవాలయాల అభివృద్ధి కి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందులోభాగంగా బాసర ఆలయాన్ని కూడా అభివృద్ధి పరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనంద సాయి, స్థపతిలు ఆలయ అభివృద్ధి నమూనాను ముఖ్యమంత్రి కి అందజేశారని తెలిపారు.

ఆలయంలో జరిగిన అపచారం విషయం ను దేవాదాయ శాఖ చూసుకుంటుందని, భాద్యులపై చర్యలు తీసుకుంటారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బాసర కు వస్తారని, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు అని తెలిపారు నిజామాబాద్ ఎంపీ కవిత.

- Advertisement -