గత కొన్నిరోజులు క్రితం డ్రగ్స్ వ్యవహాం టాలీవుడ్ ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కొంతమంది సినీ ప్రముఖులను విచారించిన సిట్ బృందం వారి నుంచి పలు కీలక సమాచారాల్ని కూడా రాబట్టుకుందని తెలిపింది.
ఇదిలా ఉండగా తాజాగా డ్రగ్స్ వ్యవహారం పై మిల్కీ బ్యూటీ తమన్నా రియార్ట్ అయింది. డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేయడం కరెక్టు కాదని అభిప్రాయపడింది.
హైదరాబాదులో ఓ షాపు ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమెను పలకరించిన మీడియాతో మాట్లాడింది. డ్రగ్స్ కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, డ్రగ్స్ హాని చేస్తాయే తప్పా, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, ముఖ్యంగా యువత ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పింది.
సినిమాల గురించి ప్రస్తావిస్తూ, తాను ముంబయిలో ఉన్నప్పటి ప్రపంచం వేరు, టాలీవుడ్ లోకి వచ్చిన తర్వాతి ప్రపంచం వేరని, ఇక్కడ ప్రేమాభిమానాలు బాగా చూపిస్తారని చెప్పింది.
తన సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని, తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. అందరినీ సంతోషపరుస్తుండాలని తాను కోరుకుంటున్నానని, ‘బాహుబలి’ ఎంతో గొప్ప చిత్రమే కాదని, ప్రత్యేకమైందని చెప్పిన తమన్నా, ప్రతి నటి గ్లోబల్ యాక్టర్ అయిపోవాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చింది.