వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘ఫిదా’ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం ఫైనల్ రన్లో సునాయాసంగా 40 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్లో ఫిదా ఓ మైల్ స్టోన్ మూవీ అని చెప్పవచ్చు. ఇప్పటికే ‘కంచె’ తో ఓ స్థాయి హిట్ అందుకున్న వరుణ్ తేజ్ కెరీర్‌కు ‘ఫిదా’ ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.
అయితే డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఓ హీరో కోసం స్టోరీ రెడీ చేశాడు. కానీ మరో హీరోతో సినిమా చేశాడు.. అదెలాగంటే సెకండాఫ్ లో కాస్త ఖుషీ చాయలు కనిపిస్తాయని, అందువలన పవన్ కళ్యాణ్ ని ఊహించుకుంటూ కథని, హీరో క్యారెక్టర్ ని రాసుకున్నట్టు శేఖర్ కమ్ముల తాజాగా ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశాడు. ఈ కథను తాను తొలత దిల్ రాజుకి చెప్పినప్పుడు.. ‘హీరోగా ఎవరిని అనుకుంటున్నావ్’? అని తనను అడిగారని, తాను తడుముకోకుండా పవన్ కల్యాణ్ అని చెప్పానని, వెంటనే దిల్ రాజు తన వైపు విచిత్రంగా చూస్తూ ఎగాదిగా ఓ లుక్ ఇచ్చారని ఆయన తెలిపారు.
ఆ తర్వాత పవన్ కల్యాణ్ డేట్స్ దొరికే సీన్ లేదని దిల్ రాజు కన్విన్స్ చేసిన తర్వాత , మిగతా హీరోలను అప్రోచ్ అవడం మొదలుపెట్టానని శేఖర్ కమ్ముల తెలిపారు. అయితే అసలు సంగతి ఏంటంటే పవన్ సినిమా కోసం రాసుకున్న కథని, ఆయనకి వినిపించకుండానే తెరకెక్కించి హిట్ కొట్టడం విశేషం.
మరోవైపు సాయిపల్లవి ఎంట్రీపై కూడా రెస్పాండ్ అయ్యాడు కమ్ముల. దాదాపు 4ఏళ్లుగా సాయిపల్లవి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకే సాయిపల్లవిని తీసుకోవాలని అనుకున్నానని తెలిపాడు. కానీ మెడిసిన్ చదువు మధ్యలోనే ఆగిపోతుందనే ఉద్దేశంతో ఆమె తల్లి ఒప్పుకోలేదని, అలా నాలుగేళ్లు వెయిట్ చేసి, ఇప్పుడు ఫిదా కోసం సాయిపల్లవిని తీసుకున్నానని అంటున్నాడు కమ్ముల.