భారత్లో ఎన్నికల ఖర్చును అదుపుచేయడానికి ఈసీ చొరవ తీసుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్. హోటల్ తాజ్ కృష్ణలో హిందు దినపత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్.రామ్ రాసిన ‘వై స్కామ్స్ ఆర్ హియట్ టు స్టే’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ …. భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. ప్రపంచంలో ఏ దేశం ఎన్నికల్లో ఖర్చు చేయని విధంగా అమెరికా ఖర్చు చేస్తుందని తెలిపారు.
స్కూల్ స్ధాయిలోనే అవినీతి వల్ల కలిగే అనర్ధాలపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. మీడియా ఎలాంటి వార్తలను రాసిన అంతిమ నిర్ణయం ప్రజలదేనని తెలిపారు. కరప్షన్ కంటే లాబీయింగ్ ప్రమాదకరమైందని ఈ సందర్భంగా రాయ్ తెలిపారు.
అంతకముందు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ఎన్.రామ్ సమావేశమయ్యారు. ఆయన రాసిన వై స్కామ్స్ ఆర్ హియర్ టు స్టే పుస్తకాన్ని కేసీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా సమకాలీన అంశాలతో పాటు, తెలంగాణ ఉద్యమం కొత్త రాష్ట్రం పయనిస్తున్న తీరుపై చర్చించారు.
తెలంగాణ ఉద్యమం ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నకు సీఎం వివరణాత్మక సమాధానం ఇచ్చారు. జీఎస్టీ విధానంపై మీ అభిప్రాయం ఏంటని ఎన్.రామ్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న జీఎస్టీ విధానం ఓ ప్రయోగమని సీఎం కేసీఆర్ తన అభిప్రాయం చెప్పారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయనేది ఎదురుచూడాల్సి ఉంది. జీఎస్టీ విధానం ఓ ప్రయోగం, చాలా దేశాలు జీఎస్టీ విధానం తెచ్చినయి. కానీ అమలులో ఏర్పడిన ఇబ్బందుల వల్ల చాలా దేశాలు వెనక్కి తగ్గాయి. మన దేశంలో ఏమవుతుందో చూడాలి. పన్నుల శ్లాబుల విషయంలో కూడా భిన్న అభిప్రాయాలున్నాయి. కేంద్రానికి వినతులు అందుతున్నాయి. కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలని కేసీఆర్ అభిప్రయాపడ్డారు.