బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’. అల్లుడు శీను, స్పీడున్నోడు వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లకొండ శ్రీనివాస్‌తో బోయపాటి చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. గత సినిమాల్లో లాగా కాకుండా శ్రీను ఇప్పుడు కొంచెం క్లాస్ టచ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ఆడియో గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
మాస్-క్లాస్ యాంగిల్‌ని మిక్స్ చేస్తూ ప్రజెంట్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ తో సహా మొత్తం ఆరుగురు హీరోలు, మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట.
బోయపాటి శ్రీను ‘జయజానకి నాయక’ మూవీ రిలీజ్ డేట్ విషయంలో వెనక్కుతగ్గాడా అంటే లేదు మిగతా సినిమాల కంటే ఒక అడుగు ముందే ఉన్నాడని తెలుస్తోంది. తొలుత ఆగష్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసినప్పటికీ అదే రోజున బాక్సాఫీస్ బరిలో మరో రెండు పెద్ద సినిమాలు ఉండటంతో ఒక రోజు ముందుగానే అంటే ఆగష్టు10న ‘జయజానకి నాయక’ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
రానా ‘నేనే రాజు నేనే మంత్రి’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘జయ జానకి నాయక’, నితిన్ ‘లై’ సినిమాలు అదే రోజున బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండటంతో ఇప్పుడు ట్రేడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూడు సినిమాల్లో ఏది లాభ పడుతుంది, దీనికి లాస్ వస్తుందనే విషయాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.