మహేష్ బాబు కొత్త చిత్రం ‘స్పైడర్’లోని ‘బూమ్ బూమ్’ పాట విడుదలై మంచి స్పందన వస్తొంది. ఈ వైరల్ అవుతున్న వేళ, ఆయన కుమార్తె సితారకు కూడా తెగ నచ్చేసింది. ఇక ఇంటా, బయటా సితార ఇదే పాటను రిపీట్ మోడ్ లో పెట్టుకుని తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఈ పాట సితారకు కొత్త ఫేవరెట్ సాంగ్ అయిపోయిందని అన్నాడు. కారులో వెళుతూ ‘బూమ్ బూమ్’ పాటను వింటూ ఆనందిస్తున్న సితార వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తన ‘చిట్టి స్పైడర్’ కారులో ఈ పాటను వింటోందని ఆనందంగా చెప్పాడు.
హరీశ్ జయరాజ్ కంపోజ్ చేసిన ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాసారు. ఈ పాటను సితార నోట విని చూసే వారు అంతా వావ్ సో క్యూట్ అని భలే ముచ్చట పడిపోతున్నారు. సితార కూడా తన నాన్న పాట అని కాకుండా నా అభిమాన హీరో పాట అన్నంతగా పాడి వినిపించింది. మహేశ్ ‘స్పైడర్’ సినిమా ట్రైలర్ మరి కొద్ది రోజులు లోనే విడుదలవుతోంది. స్పైడర్ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తున్నారు.
https://youtu.be/Nq12N2DvLIo