సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
అంతేకాదు ‘సిస్టర్ 4ఛేంజ్’ అనే నినాదంతో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కవిత సిస్టర్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా కవిత కేటీఆర్‌కు హెల్మెట్‌ను బహుమతిగా ఇచ్చారు.
అనంతరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఇద్దరు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కేటీఆర్ కవితకు చేనేత పట్టుచీరను బహుకరించాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అన్నారు. అన్నాచెల్లెలు, అక్కా తమ్ముళ్లు అందరూ కలిసి సుఖసంతోషాలతో ఈ వేడుకను జరుపుకోవాలని ఆమె కోరారు.
TRS MP @RaoKavitha sharing a helmet with her brother @KTRTRS on #RakshaBandhan to spread awareness abt two wheeler accidents. Nice gesture. pic.twitter.com/8cpPJfvkGe
— Zakka Jacob (@Zakka_Jacob) August 7, 2017