ప్రేమలో…. అన్ని అనుభవించేశా

301
Archana love affair
- Advertisement -

ప్రిన్స్.. దీక్షల మధ్య రొమాంటిక్ కిస్.. రంజుగా సాగిన పైసా వసూల్ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌తో బిగ్ బాస్ షో గత ఎపిసోడ్ మంచి హుషారుగా సాగింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్1 ఎపిసోడ్ 19 హైలైట్ విషయానికి వస్తే.. బిగ్ బాస్‌ హౌస్‌కి గ్లామర్ కలరింగ్ ఇచ్చిన దీక్షపై ఫైర్ అయ్యింది అర్చన. తన ప్రవర్తన తనను చాలా ఇబ్బంది పెడుతుందని వచ్చినప్పటి నుండి తనలో మార్పు రాలేదంటూ మిగిలిన కుటుంబ సభ్యులకు కంప్లైంట్ చేసింది.

అర్చన సింగిల్ అని, అదే షోలో పాల్గొంటున్న ప్రిన్స్ కూడా సింగిల్ అని తోటి కంటెస్టెంట్స్ ఆటపట్టిస్తున్న నేపథ్యంలో… ‘ఎన్నేళ్ల పాటు రిలేషన్ లో ఉన్నావని ప్రిన్స్, అర్చనను అడిగాడు. ఐదేళ్లని చెప్పింది. అయితే మధ్యమధ్యలో బ్రేకప్ కూడా అయ్యేదని, కానీ ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్నానని, ఆ సమయంలో చాలా ఏడ్చేదానినని చెప్పింది.

ఒక జీవితానికి సరిపడా అనుభవాలన్నీ ఆ ప్రేమలో అనుభవించేశానని చెప్పింది. ఇప్పుడు తాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగలనని, వాటి ఫలితాన్ని తన మనసు వరకు రానివ్వలేనని స్పష్టం చేసింది. తానెంత అటాచ్డ్ గా ఉంటానో అంతే డిటాచ్డ్ గా కూడా ఉండగలనని చెప్పింది. తనకు ఏది ఉన్నా, లేకున్నా ఉండగలనని అనిపిస్తుందని అర్చన చెప్పింది.

- Advertisement -