భానుమతి హంగామా కొద్ది రోజులేనా..?

202
saipallavi doctor
- Advertisement -

 ”ఫిదా” ఫేం బ్యూటి సాయిపల్లవి  ఆ సినిమాలో తన యాక్టింగ్ తో బాన్సువాడ భానుమతి పాత్రలో ఇరగదీసింది. కాని ఈమె కేవలం ఒక సింపుల్ హీరోయిన్ మాత్రం కాదు. అందరూ డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యా అంటారు. కాని ఈమె మాత్రం డాక్టర్ చదువుతూ యాక్టర్ అయ్యింది. డా. సాయి పల్లవి సెంతామరై అంటూ ఈ మధ్యనే తన ఫైనల్ ఎం.బి.బి.ఎస్ డిగ్రీ కూడా అందుకుంది.

sai pallavi

ఒక ప్రక్కన డాక్టర్ గా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ మరో ప్రక్కన యాక్టింగ్ అంటే పెద్ద విషయమే. ఇక తన డ్యాన్సుతో ఎలాగో ఇరగదీస్తోంది. ఇవన్నీ ఒక యాంగిల్ అయితే.. సాయి పల్లవికి తన ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. ముఖ్యంగా తన చెల్లెలు పూజ అంటే ఎనలేని ప్రేమ. అదిగో మొన్న జరిగిన సైమా 2016 అవార్డుల కార్యక్రమానికి కూడా ఆమెను తీసుకొచ్చింది.

sai pallavi

అయితే ఈ అమ్మడు కొన్ని రోజులు మాత్రమే సినిమాలు చేస్తుందట.. ఆ తర్వాత డాక్టర్ అయిపోతానంటోంది. తనకు సినిమాలంటే ఇష్టం ఉన్నా, తన తండ్రి కార్డియాలజిస్టు కావాలని కోరుకున్నారు. కొద్ది కాలం సినిమాల్లో నటించి బుద్ధిగా కార్డియాలజిస్టు అవుతానని తెలిపింది. అయితే, సినిమాలు చేసినన్ని రోజులు ప్రేక్షకులని ఫిదా చేస్తానంటోంది.

Sai-Pallavi-

నిర్మాత దిల్ రాజు తనకి గాడ్ ఫాదర్ అని చెప్పిన సాయి పల్లవి. వరుసగా మూడు సినిమాలు దిల్ రాజు బ్యానర్ లో చేయబోతుందట. ఇందులో నాని, శర్వానంద్ సినిమాలు ఉన్నాయి. మిగిలిన సినిమా ఏ హీరో సరసన అన్నది ఇంకా తెలియరాలేదు. అంతేకాదు.. కథ నచ్చితే.. చిన్న, స్టార్ హీరో అన్న బేధం లేనే లేదు. ఎవరి ప్రక్కనైనా నటిస్తానంటోంది. ఫిదా సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనని ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. మొత్తానికి.. ఫిదా పిల్ల కెరీర్ పై చాలా స్పష్టంగా ఉన్నట్టు కనబడుతోంది. మరి.. ఈ సింగిల్ పీస్ కి మరిన్ని విజయాలు దక్కాలని ఆశిద్దాం.

- Advertisement -