భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ‘జై లవకుశ’ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా యూఎస్ హక్కులను సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన తన స్నేహితులతో కలిసి యూఎస్ హక్కుల కోసం 10.5 కోట్లకు కోట్ చేశాడట.
దాంతో సూర్యదేవరకే యూఎస్ హక్కులను ఖరారు చేయాలని నిర్మాత కల్యాణ్ రామ్ నిర్ణయించుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ‘స్పైడర్’ తెలుగు .. తమిళ యూఎస్ హక్కులు 15.5 కోట్లకి వెళ్లగా, ‘జై లవకుశ’ యూఎస్ హక్కులు ఒక్క తెలుగుకి సంబంధించే 10.5 కోట్లు పలకడం విశేషమేనని చెప్పాలి. దీంతో స్పైడర్ కి ఎన్టీఆర్ షాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ హక్కులను దక్కించుకున్న నాగవంశీయే .. ఎన్టీఆర్ తదుపరి సినిమాకి నిర్మాత అనే సంగతి తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే.. ఇప్పటికే ‘జై’ పాత్రకి సంబంధించిన ఫస్టు లుక్ ను .. టీజర్ ను వదిలిన విషయం తెలిసిందే. వీటికి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ కూడా వచ్చింది. దాంతో ‘రాఖీ’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన ‘లవ’ పాత్రను పరిచయం చేయబోతున్నారు.
ముహూర్తం సమయాన్ని ఉదయం 10 గంటల 35 నిమిషాలుగా నిర్ణయించారు. అయితే ఈ స్పెషల్ గిఫ్ట్ ను అందించేది ఫస్టులుక్ రూపంలోనా? .. టీజర్ గానా? అనేది తేలాల్సి వుంది.