దేశంలో ఎక్కడా లేని విచిత్రమైన పరిస్థితిని తెలంగాణలో చూస్తున్నమని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన విద్యుత్ క్రమబద్ధీకరణ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేయడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉండటంతో ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.. సీఎం మాటల్లోనే “ఒక సీఎం అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనన్నాడు.. ఆ రోజు ఒక్క కాంగ్రెస్ ఎమ్మేల్యేలు కూడా మాట్లడలేదు. ఉద్యమ సమయంలో నేతల తీరును ప్రజలు చూశారు.. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేసిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారు.. రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉంది.. నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు 196 కేసులు పెట్టారు. ఉద్యోగ నోటిఫికేషన్లపై కేసులు, ఉద్యోగాలిస్తే కేసులు, మిషన్ భగీరథ మీద కేసు, మిషన్ కాకతీయ అంటే కేసు, కాళేశ్వరంపై ఒకే నెలలో ఆరు కేసులు వేశారు.. ఆ ఆరు కేసులు పీకి పోయాయి. చివరికి సుప్రీం కోర్టు కూడా కేసులను కొట్టేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ నాయకులకు కనపడడం లేదు.” సీఎం అన్నారు
హోంగార్డులంతా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారని.. వారు రూ. 3000 జీతంతో అర్థాకలితో పనిచేశారని.. అప్పట్లో వారి దుస్తితిని నేనే స్వయంగా సీఎం దృష్టికి తీసుకుపోయానని తెలిపారు. ఉద్యోగులకు స్కేలు ఇవ్వాలని కోర్టు సూచించిందని.. కోర్టు చెప్పినదానికంటే వేయి రూపాయాలు ఎక్కువే ఇస్తామన్నారు.సింగరేణి డిపెండెంట్ జాబులనూ వాళ్లు అడ్డుకున్నరన్నారు. కాంగ్రెస్ తీరుపై బాధేస్తున్నదని, తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ నేతలకు కన్ను కుడుతున్నదని కేసీఆర్ చెప్పారు.
కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలంటూ సీఎం రైతులకు విజ్ఙప్తి చేశారు. భూ సేకరణ కోసం నిర్వాసితులకు రూ. 6 లక్షలు పరిహారంగా ఇచ్చామని.. కాంగ్రెస్ అంతకు మించి ఏనాడైన ఇచ్చిందా అని ప్రశ్రించారు. విద్యుత్ ఉద్యోగుల విలీనాన్ని అడ్డుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చిల్లర, పనికిమాలిన రాజకీయాలు చేస్తోందన్న సీఎం.. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీ ఉండదన్న సమయంలో.. పొలిటికల్ మైలేజీ కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ వస్తేనే తమకు అధికారం వస్తుందని కాంగ్రెస్ భంగపడిందన్నారు. తెలంగాణ పాలిట పిశాచి కాంగ్రెస్ పార్టీ అని సీఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరీపై జాలీ పడుతున్నాని అన్నారు. శ్రీరాం సాగర్ ఫౌండేషన్ తరువాత రాష్ట్రంలో పర్యటిస్తా.. కాంగ్రెస్ పార్టీ తీరును జనానికి వివరిస్తానని చెప్పారు సీఎం.
విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చిన్నబుచ్చుకోవద్దని.. కోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేసినా.. ఉద్యోగులు ఏం బాధ పడొద్దని.. కోర్టు చెప్పిన దానికంటే ఇంక ఎక్కువే ఇవ్వడానికి తమ ప్రభుత్వం రెడీ గా ఉందన్నారు. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో కష్టాలుపడుతున్నరని…విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి కాంట్రాక్టర్లు 15 శాతం కమిషన్ తీసుకుంటున్నారని సీఎం తెలియజేశారు. కాంట్రాక్టర్ల దోపిడి నుంచి విద్యుత్ ఉద్యోగులకు కాపాడటానికే వాళ్లను డిపార్ట్ మెంట్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాం తప్ప వాళ్లను రెగ్యులరైజ్ చేస్తూ కాదని ఆయన స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులది అబ్సార్ప్షన్ కాని క్రమబద్దీకరణ కాదన్నారు.
స్కిల్డ్ వాళ్లకు కోర్టు రూ. 18 వేలు ఇవ్వాలంటే.. తాము రూ. 19 వేలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నారు. సెమీ స్కిల్డ్ వాళ్లకు రూ. 16 వేలు, అన్ స్కిల్డ్ వాళ్లకు రూ. 14 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు.