ఐటెం సాంగ్ లో కేథరిన్ అంతా చూపించిందిగా..

284
catherine Item song for boyapati-bellamkonda
- Advertisement -

కేథరిన్ … అందానికి మారుపేరు ఈ మ‌ళ‌యాళీ కుట్టి. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో.. రుద్ర‌మ‌దేవి.. స‌రైనోడు సినిమాల్లో న‌టించిన కేథ‌రిన్ త‌న అంద‌చందాల‌తో అభిమానుల మ‌న‌స్సు కొల్ల‌గొట్టింది. ఆ తరువాత పెద్దగా సినిమాలు చేయలేదు. తెలుగులో క్రేజ్ పరంగా ఆమె ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తోంది.

catherine Item song

ఈ నేపథ్యంలోనే ఆమె ‘జయ జానకి నాయక’ సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె చేసిన ఐటంసాంగ్ వీడియో టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ వీడియో టీజర్ కి యూత్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది.అయిటమ్ సాంగ్ అంటే మళ్లీ అలాంటి ఇలాంటి అయిటమ్ కాదు. వీర లెవల్లో విరగదీసేసింది. ఎ ఫర్ ఏపిలు, బి ఫర్ బుజ్జులు, సి ఫర్ సిలకలు, డి ఫర్ డింపులు అంటే సాగే మాస్ బీట్ అయిటమ్ సాంగ్ లో కేథరిన్ చేసిన డ్యాన్స్ లు, ఆ డ్రెస్ లు, మొత్తంగా అయిటమ్ సాంగ్ కు ఒక్కశాతం కూడా తగ్గకుండా న్యాయం చేసేసింది.

Catherine-Tresa

హాట్ అండ్ సెక్సీ అందాలతో ఆమె వేసిన స్టెప్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. మాస్ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడానికి ఈ ఒక్క సాంగ్ చాలు అంటున్నారు. దర్శకుడు బోయపాటి కూడా కేథరిన్ ను రకరకాల డ్రెస్ ల్లో చూపిస్తూ, ఆమె నుంచి ఎంత రాబట్టుకోవాలో అంతా రాబట్టేసుకున్నాడు.

- Advertisement -