ఐటం సాంగ్‌లో హాట్‌ హాట్‌గా..

345
Catherine Item Song in Jaya Janaki Nayaka
- Advertisement -

కేథరిన్‌ చేస్తున్నది సెకండ్ హీరోయిన్ క్యారక్టర్లైనా తన అందంతో వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతోంది. ఈ అమ్మడు తెలుగులో క్రేజ్ పరంగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ‘జయ జానకి నాయక’ సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె చేసిన ఐటంసాంగ్ వీడియో టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. “ఏ ఫర్ యాపిలూ ..” అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ లో సూపర్ హాట్ లుక్ తో కేథరిన్ రెచ్చిపోయింది. హాట్ అండ్ సెక్సీ అందాలతో ఆమె వేసిన స్టెప్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

మాస్ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడానికి ఈ ఒక్క సాంగ్ చాలు అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ తన బీట్ తో కుర్రకారులో మరోమారు ఉత్సాహాన్ని రేకెత్తించాడనే చెప్పాలి. ఈ సినిమా ఆడియోలో ఈ సాంగ్ కి ప్రత్యేకమైన స్థానం లభించడం ఖాయమనిపిస్తోంది. ఈ వీడియో టీజర్ కి యూత్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది.

Catherine Item Song in Jaya Janaki Nayaka

గతంలో ‘సరైనోడు’ సినిమాలో ఎమ్మెల్యేను చేసిన సెకండ్ హీరోయిన్ క్యారక్టర్లు చేసుకోమంటూ లైఫ్ ఇచ్చిన బోయపాటి శ్రీను.. ఇప్పుడు కూడా క్యాథరీన్ త్రెసా అలెగ్జాండర్ కు తన సినిమాలో మరో రోల్ ఇచ్చాడు. ఈసారి ఆమెను ఐటెం బాంబ్ చేసేశాడు. ఏదో ఇతర సినిమాల్లో నాలుగు సీన్లో కలిపి ఒక హాట్ సాంగ్ ఉంటే.. ఇక్కడ అటువంటి సీన్లు లేకుండా డైరక్టుగా ఒక హాటు సాంగులోకి దించేశారంతే. గ్లామర్ కు కొత్త నిర్వచనం ఇస్తాను అంటూ ఈ మధ్యన తెగ చెబుతున్న క్యాథరీన్ ఇప్పుడు నిజంగానే తన సోకులతో వెండితెరను పావనం చేస్తోంది. ఈ మద్యనే గౌతమ్ నంద సినిమాలో బికినీలో కూడా మెరిసిన క్యాథరీన్. ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ కు దగ్గరగా కనిపిస్తూ తనలోని ఐటెం భామ హొయలు ఎలా ఉంటాయో చెప్పకనే చెబుతోంది.

- Advertisement -