తమిళ బిగ్‌బాస్‌ను చిక్కుల్లో పడేసింది

207
Kamal gayatri
- Advertisement -

కమల్‌హాసన్‌ తన నటన, పాత్రలతో ఎల్లలు లేని అభిమానులను సొంతం చేసుకుని ‘లోకనాయకుడు’ అనిపించుకున్నారు. వెండితెరపై ప్రయోగాత్మక పాత్రలకి ప్రాణం పోసిన నటుడు. అంతేకాదు.. నిర్మొహమాటంగా తన అభిప్రాయం వెల్లడించడంలో కమలహాసన్ ముందుంటారు. కొత్తదనానికి కొత్త దారులు తెరచిన కమల్, ఇప్పుడు బిగ్ బాస్ షోతో బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. విజయ్ టీవీ ఛానెల్ ప్రసారం చేస్తున్న ఈ షో ఆల్రెడీ మొదలైపోయింది. అయితే ఈ బిగ్‌ బాస్ షోపై తమిళ ప్రజల నుండి వ్యతిరేఖత వస్తోంది. కమల్ హాసన్ పై తమిళ సంఘాలు కేసు కూడా వేశాయి. ఇలా తమిళ బిగ్‌ బాస్ షో వివాదాల్లో కొనసాగుతుండగా.. మరో వివాదంలో చిక్కుకున్నాడు కమల్ హాసన్.

‘బిగ్ బాస్’ రియాల్టీ షోలో తమిళ ప్రజలను అవమానించే విధంగా కామెంట్ చేశారంటూ కమల్ హాసన్ మీద రూ. 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలైంది. బిగ్‌బాస్‌లో తమిళ సంస్కృతీ సాంప్రదాయాలను అవమానించారని ఆరోపిస్తూ ఈ దావా దాఖలైంది. ‘పుతియ తమిళగం’ అనే తమిళ సంస్థ నాయకుడు కృష్ణ మూర్తి ఈ పిటీషన్ దాఖలు చేశారు.

వివాదానికి ప్రధాన కారణం…. తమిళ బిగ్ బాస్ రియాల్టీ షోలో పోటీదారు గాయత్రి రఘురామ్ చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారి తీశాయి. గాయత్రి రఘురామ్‌ మరో నటి ప్రవర్తనను ”స్లమ్ బిహేవియర్” (మురికివాడల్లో నివసించేవారిలా ఆ ప్రవర్తన ఏంటి) అని కామెంట్ చేయడం వివాదాస్పదమైంది. ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్? తమిళ పేద ప్రజల గురించి గాయత్రి రఘురామ్ అవమానకర వ్యాఖ్యలు చేశారని, దీని కారణంగా తమిళుల మనోభావాలు దెబ్బతిన్నాయని కృష్ణ మూర్తి ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ‘బిగ్ బాస్’ షో వివాదాల నేపథ్యంలో….. తెలుగులో ‘బిగ్ బాస్’ షో హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ కాస్త అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని, తెలుగులో ఎలాంటి వివాదాలు లేకుండా షో హోస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.

- Advertisement -