వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఓ ఖతర్నాక్ ఫిగర్‌ని బిగ్‌బాస్ రియాలిటీ షోలో దింపుతున్నారు. మొత్తం 14మందితో ప్రారంభమైన బిగ్‌బాస్‌లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
మొదటి వారం నటి జ్యోతి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. హీరో సంపూర్ణేష్ బాబు అర్ధంతరంగా షో నుంచి తప్పుకొన్నాడు. రెండోవారం సింగర్ మధుప్రియ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ రియాలిటీ షోకు మరింత ఊపు తెచ్చేందుకు ఓ హాటెస్ట్ భామను రంగంలోకి తీసుకొచ్చారు నిర్వాహకులు.
అర్ధంతరంగా వెళ్లిపోయిన సంపూ స్థానంలో హీరోయిన్ దీక్షా పంత్ హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోని వారిని సర్‌ప్రైజ్ ఇస్తూ.. స్మిమ్మింగ్‌పూల్‌లోకి దిగి హాట్ హాట్‌గా ఆమె ఎంట్రీ అయ్యే ఎపిసోడ్‌ను ఈరోజు ప్రసారం చేయబోతున్నారు.
అయితే, ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ముమైత్ ఖాన్‌కు తెలుగు రాకపోవడంతో ఆమెతో ఇంటిలోని వారంతా ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడుతున్నారు.
తాజాగా వచ్చిన దీక్షా పంత్‌కు తెలుగు బొత్తిగా వచ్చినట్టు కనిపించడం లేదు. ఇదే డౌట్ వచ్చి ఆమెతో ఒకటి నంచి 11 వరకు లెక్కపెట్టాలని జూనియర్ ఎన్టీఆర్ కోరగా.. ఆమె నానా తంటాలు పడి.. 20వరకు లెక్కపెట్టింది. తెలుగు రాని ముమైత్‌కు దీక్ష కూడా తోడైతే.. షోలో ఇక తెలుగుభాష వినిపించడం గగనమేనని చెప్పొచ్చు.
ఇక ఎన్టీఆర్ ఎప్పటిలాగే గ్రాండ్ ఎంట్రీతో.. తనదైన యాంకరింగ్‌తో అదరగొట్టేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మధుప్రియతో మాట్లాడారాయన. హాస్‌లో తన అనుభవాలను వివరించిన ఆమె.. ఎన్టీఆర్ ఇచ్చిన టాస్క్ మేరకు.. హౌస్‌లో తనకు ఇష్టం లేని వ్యక్తి అంటే సమీర్ అని ఇష్టమైన వారు అంటే కత్తి కార్తీక అని చెప్పింది.