బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు బిగ్‌బాస్ హౌస్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడం పై క్లారిటీ ఇచ్చాడు. బిగ్‌బాస్ షో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఇదేనంటూ..ఫేస్బుక్ లో ఒక పోస్టు పెట్టాడు. దాని సారాంశం ఇదే…
‘‘ ముందుగా ….నన్ను ఇంతకాలం ఆదరించిన నా ప్రేక్షక దేవుళ్ళకి, అందరి హీరోల అభిమానులకి ….చేతులెత్తి నమస్కరిస్తూ…..వారికి కృతజ్ఞతలు క్షమాపణలు చెప్తున్నాను….
మనకి కష్టమొచ్చినప్పుడు, మనం భుజం తట్టిన వాడే నిజమైన హీరో…..మానసిక సంఘర్షణ కి గురి అయినప్పుడు….నన్ను ఇంతటి ప్రేమకి పాత్రుడిని చేసిన రియల్ బిగ్ బాస్ మా “తారక్” అన్న కు సదా రుణ పడి వుంటాను….. సమయాభావం వల్ల నా పూర్తి ప్రసంగం చూడలేకపోయినందుకు…నా మనసులో భావాలు ఇక్కడ చెప్తున్నాను…..ఎక్కువ మంది బిగ్ బాస్ లో నా నిష్క్రమణ తర్వాత నన్ను అర్థం చేసుకున్న…..మరికొంత మంది ….అకారణంగా సోషల్ నెట్వర్కింగ్ లో దూషించటం బాధ కలిగించింది.
నా పిరికితనం వల్లో, మరో కారణం చేతనో రాలేదు….. పూర్తిగా “క్లాస్త్రోఫోబియా” కారణం చేత…..ఒక రూమ్ లో బాధించబడినప్పుడు, ఒక రకమైన, అందునా పూర్తిగా నాకు స్పృహ లేని స్థితిలో ….ఆర్థికంగా, చట్టపరంగా చర్యలు వుంటాయని తెలిసినా…..బిగ్ బాస్ నుంచి నిష్క్రమించటం జరిగింది. ఇది కేవలం పిరికితనం తో చేసిందిగా భావించి, నేను నటించే నా వృత్తికి లింక్ పెట్టటం చాల బాధ కలిగింది.
దూషణలు నాకు కొత్త కాదు….కానీ నాకు దొరికిన ఈ అదృష్టంగా జన్మ కి …నేనెప్పుడూ సమాజానికి సేవ చేస్తూ …మీతో కలిసి వుండాలని కోరుకుంటూ వున్నాను…..ఎన్నో కష్టాల్లో కూడా మీతో కలిసే వున్నాను…స్పెషల్ స్టేటస్ సమయంలో 10 గంటలు పోలీస్ స్టేషన్ లాక్ అప్ లో ఒంటరిగా గడిపినప్పుడు కూడా నా ధైర్యం సడలలేదు…..కానీ మొదటిసారి మనసు బాధ కలిగింది.
మీ ప్రేమ నాకు ఎప్పటిలాగే దొరుకుతుందని ఆశిస్తూ …మరొక్కసారి మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుకుంటూ…..
నా పై ఎప్పటిలాగే ప్రేమ చూపించిన websites, టీవీ చానెల్స్ వారికి నా నమస్కారాలు తెలియచేస్తూ….ఒకటి రెండు వెబ్సైట్ లో రాసినట్టుగా, నాకు 15 లక్షల జరిమానా , ఆత్మహత్య ప్రయత్నం లాంటి అవాస్తవ వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలియజేస్తున్నాను.
ఇంతటి అవకాశం కల్పించిన స్టార్ టీవీ వారికి, బిగ్ బాస్ వారికి,. నా నమస్సుమాంజలి. నటుడుగా మీతో ఎల్లప్పుడూ మీ ప్రేమకి పాత్రుడవ్వాలని ఎప్పుడు కోరుకునే
సదా మీ ప్రేమకి బానిస..మీ సంపూర్ణేష్ బాబు..’’