తమ్ముడు….పులి నాలాగే ఉంటుంది

335
Paisa Vasool Stumper 101
- Advertisement -

నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘పైసా వసూల్’. భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి , ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటోంది.

టీజర్ కా బాప్ అంటూ ఈ సినిమా స్టంపర్‌ని విడుదల చేశారు. ఇందులో బాలాయ్య చెప్పిన డైలాగ్‌లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ‘తమ్ముడూ నేను జంగిల్‌ బుక్‌ సినిమ చూడలా. కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు’ అంటున్నారు బాలయ్య.

ఇందులో బాలయ్య.. ఇంగ్లీష్‌, తెలుగులో చెప్తున్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మధ్యలో వచ్చే ఫైటింగ్‌ సన్నివేశాలు, బాలయ్య స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో బాలకృష్ణకు జోడీగా శ్రియ, ముస్కాన్‌,కైరా దత్‌ నటిస్తున్నారు. ఓ సారి ట్రైలర్‌ను మీరు చూసేయండి…

- Advertisement -