అందుకు భిన్నంగా నా ల‌వ్ స్టోరీ

175
Naa Love Story Press Note
- Advertisement -

కొత్త టాలెంట్ ను ప్రోత్స‌హిస్తూ, మ‌హీధ‌ర్, సోనాక్షి సింగ్ ల‌ను హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ అశ్వినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై , కె. శేష‌గిరి రావు నిర్మిస్తున్న చిత్రం ‘నా ల‌వ్ స్టోరీ’.

డైర‌క్ట‌ర్ జి. శివ గంగాధ‌ర్ మాట్లాడుతూ, ”నేను శివ శ‌క్తిద‌త్త‌, సి. ఉమామ‌హేశ్వ‌ర రావు, ఈశ్వ‌ర్ రెడ్డి, తుమ్మ‌ల రమేష్ వంటి ప్ర‌ముఖుల దగ్గ‌ర ప‌ని చేశాను. నా ల‌వ్ స్టోరీ సినిమా ప్ర‌స్తుతం రెండ‌వ షెడ్యూల్ పూర్తి చేసుకుని, ఆగ‌స్టులో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ అయిన పార్ట్ చాలా బాగా వ‌చ్చింది. ప్ర‌స్తుతం వ‌స్తున్న ల‌వ్ బేస్డ్ కాన్సెప్ట్ సినిమాల‌కు ఈ సినిమా భిన్నంగా ఉండ‌నుంది. ఈ త‌రం జ‌న‌రేష‌న్ కు సినిమా బాగా న‌చ్చేలా ఉంటుంద‌”న్నారు.

చిత్ర నిర్మాత‌ మాట్లాడుతూ, ”డైర‌క్ట‌ర్ శివ చెప్పిన కథ కంటే, మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. రెండు పాటలు మిన‌హా, షూటింగ్ మొత్తం పూర్త‌యిపోయింది. జులై 28 వ తేదీన పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న మా హీరో మ‌హిధ‌ర్ కు నా ల‌వ్ స్టోరీ టీమ్ నుంచి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాం” అన్నారు.

న‌టీన‌టులుః
మ‌హీధ‌ర్, సోనాక్షి సింగ్, తోట‌ప‌ల్లి మ‌ధు, శివ‌న్నారాయ‌ణ‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, డి.వి ల‌తో పాటూ, కొత్త టాలెంట్ ను ప్రోత్స‌హించే క్ర‌మంలో మ‌రికొంద‌రు నూత‌న న‌టీన‌టుల‌ను కూడా వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్నారు.

సాంకేతిక నిపుణులుః
సినిమాటోగ్ర‌ఫీః వై.ఇ. కిర‌ణ్
పీఆర్ఓః గాండ్ల శ్రీనివాస్ (GS MEDIA)
ఎడిటర్ః నంద‌మూరి హ‌రి
సంగీతంః వేధ‌నేవ‌న్‌
డైలాగ్స్ః మ‌ల్కారి శ్రీనివాస్
బ్యాన‌ర్ః అశ్విని క్రియేష‌న్స్
కో-డైర‌క్ట‌ర్ః సేతుప‌తి
డైర‌క్ట‌ర్ః జి. శివ గంగాధ‌ర్⁠⁠⁠⁠

- Advertisement -