టాలీవుడ్ హాట్ హీరోయిన్ శృతిహాసన్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏమో… కానీ… ఓ విదేశీ అబ్బాయితో మాత్రం తెగ తిరిగేస్తోంది. ఆ మధ్య బ్రిటన్ వెళ్లి బాయ్ ఫ్రెండ్ ని మీట్ అయ్యి వార్తల్లోకి వచ్చింది శ్రుతిహాసన్.
ఈ అమ్మడుకి ఒక విదేశీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతడు లండన్ లో ఉంటాడని, వీరిద్దరూ బాగా క్లోజ్ అయిపోయారని.. వీరి ప్రేమకు కమల్ ఆశీస్సులు కూడా ఉన్నాయని కొన్నాళ్ల కిందట వార్తలు వచ్చాయి. అయితే తన ప్రేమ కథ గురించి శ్రుతి హాసన్ రియాక్ట్ అవలేదు.
అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… శ్రుతి విదేశీ బాయ్ ఫ్రెండ్ ఇండియాకు వచ్చాడు. మైఖేల్ కొర్సలే అనే అతడు ఇటాలియన్. లండన్ లో ఉంటాడు. బుధవారం రాత్రి తను లండన్ నుంచి ముంబైలో దిగాడు. అతడిని రిసీవ్ చేసుకోవడానికి శ్రుతిహాసన్ స్వయంగా వెళ్లింది. మీడియా కంట పడింది.
ఈ విషయాన్ని ‘ముంబై మిర్రర్’ రిపోర్ట్ చేసింది. బుధవారం మైఖేల్ లండన్ నుంచి వచ్చాడని, అతడిని శ్రుతి వెంట తీసుకెళ్లిందని ఆ పత్రిక ప్రత్యేక కథనం రాసింది. ప్రస్తుతం శ్రుతి తన తండ్రి సినిమా ‘శభాష్ నాయుడు’ షూటింగ్ కోసం ముంబైలో ఉంది.
మరి ఇంత గ్యాప్ తర్వాత ప్రియుడిని చూడగానే శ్రుతి కంట్రోల్ చేసుకోలేకపోయినట్టుంది. అతడు కారులోకి ఎక్కగానే గట్టిగా వాటేసుకుంది. ఈ సన్నివేశం కూడా మీడియా కంట పడింది, ఇంకేముందీ…కెమెరాలు క్లిక్ మన్నాయి. ఒక సౌత్ హీరోతో బ్రేకప్ తర్వాత చాలా కాలం పాటు సోలోగా గడిపేసిని శ్రుతిహాసన్.. ఇప్పుడు మాత్రం ప్రియుడితో విలువైన సమయాన్ని గడుపుతున్నట్టుగా ఉంది.
ఇక త్వరలో శృతి మీడియా కంటపడితే… అతన్ని వాటేసుకున్న విషయంపై ఖచ్చితంగా ప్రశ్నల వర్షం కురుస్తుంది. అప్పుడు కూడా శృతి వ్యక్తిగత విషయాల్ని పంచుకోను అంటుదో ఏమో.