మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు.. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ బ్లాక్ బస్టర్ హిట్ కొ్ట్టి అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసింది.
ఇక ‘ఇష్టం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రేయ.. తెలుగు, తమిళ, హిందీ,మళియాళ, కన్నడ భాషల్లోనే కాదు హాలీవుడ్ లో కూడా నటించింది. అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదిహేను సంవత్సరాలు దాటినా కూడా ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా హీరోయిన్ గా నటిస్తుంది శ్రేయా. ఇదంతా ఎందుకంటే రాంచరణ్, శ్రేయ జంటగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు విషయానికి వస్తే..వీళ్లు గ్లామర్ ఇండస్ర్టీలోకి రాకముందు ఓ యాక్టింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమోషనల్ సీన్‌ని పండించేందుకు ట్రై చేశారు.
బాహుబలి సినిమాతో జాతీయంగా పేరు తెచ్చుకుంది అనుష్క.. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి లేడి ఓరియెంటెడ్ పాత్రలలో నటించిన అనుష్క కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకుంది. ఒకప్పుడు సినిమాలు అంటేనే చాలా దూరంగా ఉండే అనష్క.. ఇండస్ట్రీకి రాకముందు ఓ ఆడిషన్ లో పాల్గొంది. దర్శక నిర్మాతలు ఇచ్చిన రొమాంటిక్ సీన్ ని పండించింది. ఇప్పుడు అనుష్క పర్ ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.