అటెండర్ మణి పాడె మోసిన సంతోష్ కుమార్

5
- Advertisement -

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అటెండర్ గా పనిచేస్తున్న ముస్తాబాద్ మండలం బండనకల్ కి చెందిన మణిదీప్ కుమార్ నిన్న బందనకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా, స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో పాటు కేసిఆర్ గారి వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు.

మణికుమార్ మరణవార్త వినగానే స్పందించిన కేసిఆర్ అన్ని దగ్గరుండి చూసుకోవాలని సంతోష్ కుమార్ ని ఆదేశించారు.కేసిఆర్ గారి ఆదేశాల మేరకు బందనకల్ కి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చారు. పాడే మోసి మణిదీప్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మణిదీప్ కుటుంబాన్ని కేసిఆర్ గారు అన్ని విధాలుగా ఆదుకుంటారని తెలిపారు. మణిదీప్ కి నాన్న,చెల్లి, నానమ్మ ఉన్నారు. మణిదీప్ చెల్లి చదువుతో పాటు పెళ్లి బాధ్యతలు కేసిఆర్ గారు తీసుకుంటారని చెప్పారు. నాన్న, నాన్నమ్మ ఆరోగ్య బాగోగులు కూడా కేసిఆర్ గారు చూసుకుంటారని తెలిపారు.

Also Read:నివేదా థామస్..‘శ్రీమతి’

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు, కేసిఆర్ గారి వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -