ట్రెండింగ్‌లో ‘డివికి డివికి’

1
- Advertisement -

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’. హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. కలర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఎంటర్‌టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘డివికి డివికి’ ని రిలీజ్ చేశారు.

జి.వి. ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ‘‘డివికి డివికి’’ అమ్మాయిలందరికీ అంకితం చేసిన వైబ్రెంట్ సెలబ్రేషన్ సాంగ్. ఫెస్టివ్ ఎనర్జీ, కలర్‌ఫుల్ విజువల్స్, ఆకట్టుకునే రిథమ్‌తో ఈ పాట సాగుతుంది. అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ వదిన, మరదళ్ల మధ్య ఉండే ఆప్యాయత, సరదా సంభాషణలను చాలా అందంగా చూపించాయి. మధు ప్రియ, హరి ప్రియ తమ ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాన్స్ సీక్వెన్స్‌లను చాలా ఎంగేజింగ్‌గా, విజువల్‌గా ఆకట్టుకునేలా రూపొందించారు.

కీర్తి సురేష్, కృతి శెట్టి తమ ట్రెడిషనల్ లుక్స్, చలాకీ ఎక్స్‌ప్రెషన్స్, ఎనర్జీ, గ్రేస్‌ఫుల్ డాన్స్ మూవ్స్‌తో పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, తెరపై కనిపించే ఆప్యాయత పాటను మరింత ఆహ్లాదకరంగా మార్చాయి. వెంకటేష్, కల్యాణ్ రామ్ కూడా ఈ సెలబ్రేషన్స్‌లో జాయిన్ అయి మరింత సందడి చేశారు. ముఖ్యంగా ఈ పాటలోని క్యాచీ హుక్ స్టెప్ సోషల్ మీడియా ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ స్టెప్ ట్రెండ్ అయ్యింది.

అనిల్ రావిపూడి తన సినిమాల్లో కంపోజర్స్ నుంచి క్యాచీగా, ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయ్యే మ్యూజికల్ నంబర్స్‌ను తీసుకోవడంలో తన ప్రత్యేకతను మరోసారి చూపించారు. ‘డివికి డివికి’ ఎనర్జిటిక్ కంపోజిషన్, లైవ్లీ కొరియోగ్రఫీ, కలర్‌ఫుల్ విజువల్ ప్రెజెంటేషన్‌తో ఈ పాట మంచి సెలబ్రేషన్ నంబర్‌గా రూపొందింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మ్యూజిక్ చార్ట్స్‌లోనూ తనదైన ముద్ర వేసింది.

Also Read:Jeera: జీలకర్రతో హెల్తీ డ్రింక్స్

ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సీజన్‌లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా జనవరి 12, 2027న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

- Advertisement -