ఇండియాలో బాలీవుడ్ తరువాత అంత క్రేజ్ ఉన్న ఇండస్ట్రిలు అంటే అవి తెలుగు తమిళ్ సినిమా పరిశ్రమలే అని చెప్పుకోవాలి. సౌత్ సినిమా అంటే జనాలులలో ఎంత క్రేజ్ ఏర్పడిందో బాహుబలి తరువాత మళ్ళీ వివేగం టీజర్‌తో యూట్యూబ్ సాక్షిగా రుజువైంది. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అంటే తమిళనాడులో ఇక్కడ ఒక పవన్ కల్యాణ్ కు ఉన్నంత క్రేజ్ ఉంది. మరి అలాంటి హీరో సినిమా ఒకటి రాబోతుంది.
అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన వివేగం టీజర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఈ టీజర్‌కు 5,03,650 లైక్‌లు దక్కాయి. దీంతో ఇండియాలనే ఎక్కువ లైక్‌లు వచ్చిన సినిమా టీజర్‌గా వివేగం రికార్డు సాధించింది. అయితే ఇదివరకు సల్మాన్ నటించిన ‘ట్యూబ్‌లైట్’కు 5,03,000 లైక్‌లు రాగా, వాటిని అజిత్ వివేగంతో బ్రేక్ చేశాడు.
ఇక యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ సరసన కాజల్ నటించగా, అక్షరహాసన్ మరో హీరోయిన్గా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ విలన్‌గా కనిపించనున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, ఆగష్టు 10న ఈ చిత్రం విడుదల కానుంది.