రెండోసారి ICC చైర్మన్‌గా జై షా

3
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా జై షా మరోసారి ఎన్నికయ్యారు. రెండోసారి ఆయనను ఏకగ్రీవంగా తిరిగి నియమిస్తున్నట్లు ఐసీసీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు, కమిటీ సమావేశాల సందర్భంగా డైరెక్టర్లు జై షా పేరును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయకపోవడంతో ఆయన రెండోసారి చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు.

జై షా నాయకత్వంపై ఐసీసీ బోర్డుకు ఉన్న నమ్మకానికి ఈ నిర్ణయం నిదర్శనమని అంతర్జాతీయ క్రికెట్ మండలి పేర్కొంది. క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన కొనసాగింపు కీలకమని అభిప్రాయపడింది.

క్రికెట్‌ను మరిన్ని దేశాలకు విస్తరించడం, అభిమానుల సంఖ్యను పెంచడం, వాణిజ్యపరమైన అభివృద్ధికి కొత్త అవకాశాలు కల్పించడం వంటి అంశాలు ఐసీసీ భవిష్యత్ వ్యూహంలో ప్రధానంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ లక్ష్యాలను సాధించేందుకు జై షా నాయకత్వం, అనుభవం ఉపయోగపడతాయని బోర్డు విశ్వాసం వ్యక్తం చేసింది.

ALso Read:గొప్ప అనుభూతిని ఇచ్చే ‘ఆకాశంలో ఒక తార’!

క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు తిరిగి చోటు దక్కడం, అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడను మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్న సమయంలో జై షా రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

- Advertisement -