BB10: శ్వేత ఎలిమినేట్

0
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదో వారం ఉత్కంఠకు తెరపడింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రేక్షకులు భావించినప్పటికీ బీబీ టీమ్ ఒక్కరితోనే సరిపెట్టుకుంది. చివరకు శ్వేత ఎలిమినేట్ అయింది. ఆమె బయటకు వెళ్లడంతో ఇంటి సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా అమన్ అయితే శ్వేతను పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. స్టేజ్ మీదకు వచ్చిన శ్వేత తన జర్నీని చూసుకుని ఎమోషనల్ అయింది.

అనంతరం నాగార్జున ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ముగ్గురు కంటెస్టెంట్లకు మూడు వస్తువులను ఎంపిక చేసి సలహాలు ఇచ్చింది. ముందుగా అమన్‌కు కత్తిని డెడికేట్ చేసింది. అమన్ చాలా తెలివైనవాడని, స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి అని ప్రశంసించింది. అయితే ఇతరుల విషయంలో కొంత స్వార్థంగా ఉండాలని, తన ఆటను మరింత తెలివిగా ఆడాలని సూచించింది. అమన్ టైటిల్ గెలవాలని, విన్నర్‌గా చూడాలని తన కోరికను వ్యక్తం చేసింది.

తర్వాత దేబ్జానీకి ‘టైమ్ టు వేకప్’ అనే వస్తువును ఇచ్చింది. సొంత వ్యక్తిత్వాన్ని చూపించాలని, ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికింది. ముఖ్యంగా రామన్నను షీల్డ్‌లా ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోందని, తనదైన ఆటతో ముందుకు రావాలని సూచించింది. దీనికి స్పందించిన దేబ్జానీ.. ఇప్పటికే మేల్కొన్నానని, తన ఆట ఏమిటో చూపిస్తానని చెప్పింది.

ముకేష్‌కు ‘స్టక్ రికార్డ్’ అనే వస్తువును ఎంపిక చేసిన శ్వేత.. సొంత ఆటను తనే దెబ్బతీసుకుంటున్నావని విమర్శించింది. ఇతరులు ఇచ్చే సలహాలను స్వీకరించి ఆటను మెరుగుపరుచుకోవాలని సూచించింది.

Also Read:గొప్ప అనుభూతిని ఇచ్చే ‘ఆకాశంలో ఒక తార’!

- Advertisement -