ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం ‘స్పైడర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన మురుగదాస్, మహేష్ బర్త్ డేకి టీజర్ లేదంటే ట్రైలర్ ని విడుదల చేయాలని అనుకుంటున్నాడట. మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన స్పైడర్ మూవీ అంతటా రికార్డుల ప్రభంజనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
సౌత్ ఇండియాలో భారీ ప్రొడక్షన్ సంస్థగా పేరుగావించిన లైకా ప్రొడక్షన్స్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న స్పైడర్ చిత్ర రైట్స్ దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2.0 వంటి భారీ బడ్జెట్ సినిమాతో పాటు మరో ఐదు సినిమాలను నిర్మింస్తోందీ అంతర్జాతీయ సంస్థ. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘స్పైడర్’ చిత్రం విడుదల హక్కులను సొంతం చేసుకుంది.
స్పైడర్ చిత్ర తమిళ రైట్స్ కోసం ఈ సంస్థ భారీ మొత్తాన్నే ముట్టజెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏఆర్ మురుగదాస్, మహేశ్ కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించారు. హ్యారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు.