సజ్జనార్ యూనిఫాంలో ఉన్న ఒక క్రిమినల్ అని ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు. సజ్జనార్‌ను బదిలీ చేయడం అతనికి శిక్ష కాదు..అతని నేరాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు.
యూనిఫాంలో ఉన్న నేరస్థుడైన వి.సి. సజ్జనార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (@CPHydCity) పదవి నుండి బదిలీ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ కి ధన్యవాదాలు చెప్పారు.
ఒకప్పటి సర్వీస్ సహోద్యోగిని ‘యూనిఫాంలో ఉన్న నేరస్థుడు’ అని విమర్శించడం నాకు ఎంతో బాధను కలిగిస్తోంది అయినప్పటికీ అదే నిజం. సర్వీస్ స్నేహం కంటే ప్రజా ప్రయోజనమే ఎంతో ముఖ్యం, కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి అని తెలిపారు.
Also Read:శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్..54 ప్రత్యేక రైళ్లు!
బదిలీ అనేది శిక్ష కాదు అది నేరాలను తుడిచివేయదు కూడా. అందువల్ల ఆయన చేసిన అన్ని నేరపూరిత కార్యకలాపాలపై సమగ్ర విచారణకు ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. వ్యవస్థలోని ఈ పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేయడానికి ఆయనను చట్టం ముందు నిలబెట్టడమే ఏకైక మార్గం అని పేర్కొన్నారు.


