పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అలీ గారు ఇలాంటి మంచి పాత్రల్లో కనిపించడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా యంగ్ టీమ్ కలిసి చేసిన సినిమా ‘DNK’. మౌళి చాలా నీట్‌గా ప్లాన్ చేసుకుని ఈ సినిమా చేశాడు. తనకు అన్ని క్రాఫ్ట్స్‌పై మంచి అవగాహన ఉందని ఈ మధ్యే తెలిసింది. మౌళిది మా జిమ్మే. జిమ్‌లో ఉన్న ప్రతి మెషీన్‌ను టచ్ చేస్తాడు. (నవ్వుతూ) ‘లిటిల్ హార్ట్స్’ సినిమా చూసిన తర్వాత నవ్వుతూనే ఉన్నాను. ‘DNK’ కూడా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా నవంబర్ 13న విడుదలవుతోంది. పెద్దలు అందరూ చూడండి. 14న పిల్లలందరినీ తీసుకెళ్లండి. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడండి. పెద్ద హిట్ చేయండి. థాంక్యూ వెరీ మచ్.
హీరో మౌళి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బుచ్చిబాబు గారికి, వివేక్ ఆత్రేయ గారికి, శ్రీ విష్ణు గారికి, ఎస్కేఎన్ గారికి పేరుపేరునా ధన్యవాదాలు. మైత్రీ మూవీ మేకర్స్ అనిల్ గారు, చెర్రీ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నప్పటికీ, నేను ఎప్పుడు కాల్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతారు. వాళ్లకు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉండదు. ఎంతో ఆప్యాయంగా ఉంటారు..నవంబర్ 13న అందరూ థియేటర్లకు వచ్చి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
Also Read:రోషన్ ..అడ్వెంచర్ మూవీ!
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శ్రీవిష్ణు గారికి, వివేక్ ఆత్రేయ గారికి, ఎస్కేఎన్ గారికి పేరుపేరునా ధన్యవాదాలు. మౌళి ఈ సినిమాను దగ్గరుండి చూసుకుంటూ ఎగ్జిక్యూట్ చేస్తానని, తనకు ఫ్రీడమ్ ఇవ్వాలని అడిగాడు. తన ‘లిటిల్ హార్ట్స్’ అద్భుతమైన సినిమా అన్నారు.

