అగ్నిపరీక్ష మొదటి సీజన్ ఘన విజయం సాధించగా అందులో పాల్గొన్న కళ్యాణ్ పడాల 9వ సీజన్ విన్నర్‌గా నిలిచారు. ఈ క్రేజ్‌తో వచ్చిన రెండో సీజన్ కూడా వివాదాలతో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఉప్పల్ బాలు తిట్ల దండకం, నవదీప్ కామెంట్స్ ఈ సీజన్‌ను వివాదాల్లో నిలిపాయి.
ఈ రెండో సీజన్లో రాజ కుమారి డయానాకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. జ్యూరీ నుంచి మూడు గ్రీన్ సిగ్నల్స్ అందుకుని టాప్ 15లోకి దూసుకెళ్లిన ఆమె, గ్రీన్ బ్యాడ్జీలతో అద్భుతంగా రాణించింది. కచ్చితంగా బిగ్‌బాస్‌లోకి వెళ్తుందని అందరూ భావించినా, అనూహ్యంగా శ్రిష్టి, షాలినీ, అపూర్వాలను ఎంపిక చేశారు. మొదటి నుంచి బాగా హైప్ ఇచ్చిన బిగ్‌బాస్ టీమ్, చివరికి ఆమెను పక్కన పెట్టడంతో రాజకుమారి ప్రత్యామ్నాయంగా జబర్దస్త్ బాట పట్టింది. నూకరాజు టీంలో ఫిక్స్ అయిన ఆమె, ఇకపై అక్కడే తన ప్రయాణాన్ని కొనసాగించనుంది.
మరోవైపు, అగ్నిపరీక్ష నుంచి వెళ్లిన లేడీ కంటెస్టెంట్లు ఎవరూ హౌస్‌లో లేరు. ఇంట్లో ఉన్న ఆర్కేపై ఆశలు సన్నగిల్లగా, విన్నర్ అవుతాడనుకున్న రోహిత్ తన ప్రవర్తనతో అవకాశాలను కోల్పోయాడు. ప్రస్తుతం అతని రీ-ఎంట్రీపై రూమర్స్ వినిపిస్తున్నాయి.
Also Read:KTR:వట్టిపోయిన శ్రీరాంసాగర్‌కు జీవం పోసింది కేసీఆరే!
ఇదిలా ఉంటే, బిగ్‌బాస్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఓ సంచలనం చోటుచేసుకుంది. పదో వారం ఫ్యామిలీ వీక్‌లో భాగంగా కంటెస్టెంట్ శివ్ కోసం ప్రియాంక హౌస్‌లోకి అడుగుపెట్టారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, బిగ్‌బాస్ హౌస్‌లోనే తమ నిశ్చితార్థాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఏ భాషా బిగ్‌బాస్‌లోనూ జరగని ఈ సరికొత్త ఘట్టానికి తోటి కంటెస్టెంట్లే బంధువులుగా మారి వేడుకను విజయవంతం చేశారు. త్వరలో పెళ్లిపీట ఎక్కనున్న ఈ జోడీ నిర్ణయం ప్రస్తుతం బుల్లితెరపై హాట్ టాపిక్‌గా మారింది.

