డ్రగ్స్ కేసు : సిట్ ముందుకు చార్మి

341
Tollywood drug racket: Charmi at sit office
- Advertisement -

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రముఖ సినీ నటి ఛార్మీని సిట్ ఎలా విచారించనుందన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. అయితే ఛార్మీ విచారణ ఇప్పటి వరకు జరిగిన విచారణలకు భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ విచారణ ఎదుర్కొనేందుకు ఛార్మీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కాగా, ఆమెను విచారించేందుకు ఎక్సైజ్ మహిళా సూపరింటెండెంట్ తో పాటు
ముగ్గురు మహిళా సీఐలను సిట్ ఎంపిక చేసింది. వీరు నలుగురూ ఛార్మీని విచారించనున్నారు.

సిట్ విచారణకు రావాల్సిన హీరోయిన్ చార్మి, ఈ ఉదయం 6 గంటలకే తాను సహ నిర్మాతగా ఉన్న ‘పైసా వసూల్’ షూటింగ్ లొకేషన్ కు వెళ్లిపోయింది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కొండాపూర్ ప్రాంతంలో జరుగుతుండగా, నేటి షూటింగ్ వ్యవహాలను పర్యవేక్షించేందుకు ఆమె అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా సిట్ విచారణకు చార్మి హాజరైంది. బాబ్డ్ హెయిర్ కటింగ్ తో, బ్లూ కలర్ షర్ట్ వేసుకుని  అబ్కారీ ఆఫీస్‌కి వచ్చింది చార్మి.

హైకోర్టు ఆదేశాల మేరకు ఛార్మీ నుంచి నిజాలు రాబట్టేందుకు సిట్ అధికారులు వ్యూహాత్మకంగా ప్రశ్నావళిని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు చార్మిని విచారించనున్నట్లు తెలుస్తోంది. పూరీతో కలసి డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా ఉన్న ఆధారాలతో పాటు కెల్విన్ తో ఆమె జరిపిన వాట్స్ యాప్ సంభాషణలు, ఫోన్ వివరాలను ఆమె ముందు ఉంచనున్నారు. అలాగే అతనితో దిగిన ఫోటోలను కూడా ఆమెకు చూపించి విచారించనున్నారు. సినీ ప్రముఖులకు డ్రగ్స్‌తో సంబంధాల గురించి ఆరా తీయనున్నారు. చార్మీ విచారణకు సహకరించకపోతే మరో రోజు విచారించనున్నారు.

- Advertisement -