మెట్రో – ఆర్టీసీ.. ప్రయాణికులకు భారీ ఊరట!

2
- Advertisement -

హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను ప్రభుత్వం తగ్గించింది. ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గతంలో అడ్డగోలుగా ధరలు నిర్ణయించారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై టీ న్యూస్ కూడా వరుస కథనాల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది.

మెట్రో–ఆర్టీసీ ఉమ్మడి పాస్ ధరలపై ప్రయాణికుల నుంచి వస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు స్వయంగా మంత్రులు మెట్రో రైలులో ప్రయాణించిన తర్వాత పాస్ ధరలపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం ప్రకటించింది.

తాజా నిర్ణయం ప్రకారం ఇప్పటివరకు రూ.400గా ఉన్న రోజువారీ ఉమ్మడి పాస్ ధరను రూ.275కు తగ్గించారు. అలాగే రూ.8,500గా ఉన్న నెలవారీ పాస్ ధరను ఏకంగా రూ.4,000కు కుదించారు. దీంతో నెలవారీ పాస్ తీసుకునే ప్రయాణికులకు రూ.4,500 ఆదా కానుంది. ఈ తగ్గించిన ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో మెట్రో, ఆర్టీసీ సేవలను కలిపి వినియోగించుకునే ప్రయాణికులకు గణనీయమైన ఊరట లభించనుంది. ధరల తగ్గింపుపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -