రామాయణ ఫస్ట్ డే వసూళ్లు!

1
- Advertisement -

ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ‘రామాయణ పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

ట్రేడ్ ట్రాకర్ Sacnilk వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 5న సాయంత్రం 5 గంటల వరకు ఈ సినిమా భారత్‌లో రూ.40.97 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా 17,916 షోల ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టింది. అయితే సాయంత్రం, రాత్రి షోల వసూళ్లు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో ఫైనల్ కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది.

తొలిరోజు హిందీ 3డీ షోలకు మొత్తంగా 24.54 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోలకు 22.77 శాతం ఆక్యుపెన్సీ ఉండగా, మధ్యాహ్నం షోలకు అది 26.31 శాతానికి పెరిగింది. సాయంత్రం, రాత్రి షోల వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

ప్రాంతాల వారీగా చూస్తే నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో అత్యధికంగా 1,146 హిందీ 3డీ షోలు ప్రదర్శించారు. అయితే ఆక్యుపెన్సీ విషయంలో కోల్‌కతా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 33 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైంది. ఓవర్సీస్ మార్కెట్లలో ఇంగ్లిష్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.

– హిందీ: రూ.29.28 కోట్లు
– కన్నడ: రూ.5.19 కోట్లు
– తెలుగు: రూ.4 కోట్లు
– తమిళం: రూ.1.64 కోట్లు
– మలయాళం: రూ.86 లక్షలు

Also Read:రామాయణంపై జక్కన్న ప్రశంసలు

ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్ నటించారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవీ దూబే కనిపించనున్నారు. వీరితో పాటు శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారా దత్తా, దశరథుడిగా అరుణ్ గోవిల్, మండోదరిగా కాజల్ అగర్వాల్ నటించారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్ ఈ సినిమాను నిర్మించారు. ఆస్కార్ అవార్డు విజేతలు హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

- Advertisement -