- Advertisement -
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు క్షమాపణ చెప్పారు మాజీ మంత్రి కొండా సురేఖ.కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత దూషణల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు.
ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు…ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది అన్నారు.
కేటీఆర్ ని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గానీ నాకు ఎంతమాత్రం లేదు..నా వ్యాఖ్యలు కేటీఆర్ గారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానంటూ క్షమాపణలు చెప్పారు.

- Advertisement -

