డ్రగ్స్‌: కాజల్‌తో పాటు ఈ భామలు కూడా…

259
Tollywood drug scandal: Kajal Aggarwal ? rasikhanna, lavanya tripati link ?
- Advertisement -

డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌ ని షేక్‌ చేస్తోంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ సిట్ విచారణతో టాలీవుడ్‌ ఉక్కిబిక్కిరౌతోంది. ఇప్పటివరకూ సినీ స్టార్లను డ్రగ్స్‌ వ్యవహారంలో విచారిస్తున్నా…తాజాగా వెలుగుచూసిని ఉదంతం వల్ల… సినీస్టార్ల దగ్గర పనిచేసే వారిని కూడా సిట్‌ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం..? వారు కూడా డ్రగ్స్‌ దందాలో దొరికిపోవడమే. రీసెంట్‌గా కాజల్ మేనేజర్ రోనీ అలియాస్ రాన్‌సన్ జోసెఫ్‌ వద్ద మాదకద్రవ్యాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

   Tollywood drug scandal: Kajal Aggarwal ? rasikhanna, lavanya tripati link ?

దీంతో కాజల్‌ అగర్వాల్ కాస్త గుబులు పడుతోందనే గుసగుసలు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అంతేకాదు కాజల్ తో పాటు రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి లకు కూడా డ్రగ్స్‌ మరక అంటేనా? అనే డౌట్స్‌ క్రియేట్‌ అవుతున్నాయి. ఎందుకంటే..రోనీ గతంలో రాశీఖన్నా, లావణ్య త్రిపాఠిలకు కూడా మేనేజర్‌గా వ్యవహరించాడు. మరోవైపు, రోనీని విచారిస్తే, డ్రగ్స్ వ్యవహారంలో మరింత కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

రోనీ వద్ద మాదకద్రవ్యాలు లభ్యం కావడంతో ఈ వ్యవహారంలో పరిశ్రమలోని మరికొంత మంది హీరోయిన్లకు కూడా సంబంధాలు ఉండే అవకాశం ఉందని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా కాజల్, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠిలకు డ్రగ్స్‌తో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, ఈ ముగ్గురు భామలకు సిట్ నోటీసులు జారీచేసి, విచారణకు పిలిస్తే తప్పక హాజరుకావాల్సి ఉంటుంది.

    Tollywood drug scandal: Kajal Aggarwal ? rasikhanna, lavanya tripati link ?

ఇదిలా ఉంటే..రోనీ డ్రగ్స్ తీసుకుంటున్నాడా లేదా అనే విషయాన్ని వైద్యపరీక్షల ఆధారంగా ధ్రువీకరించనున్నారు. ఒకవేళ రోనీడ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే అతడికి ఎలా లభించాయి. వాటిని ఎవరెవరకి అందించాడనే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -