కన్నెపల్లి పంప్ హౌసు సందర్శనకు బయలుదేరింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. మేడిగడ్డ వద్ద ఇప్పటికే 751 టీఎంసీల నీళ్లు కిందికి వదిలేశారని అందులో 200 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసినా హైదరాబాద్ తాగునీటి సమస్యతో పాటు, రైతులకు నీళ్లు అందించేవారని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
ఇప్పటికీ కూడా మేడిగడ్డ వద్ద 22 వేల క్యూసెక్కుల నీళ్లు దిగువకు పారుతున్నయి.. ఈ నీటిని లిఫ్ట్ చేసి కాళేశ్వరం ద్వారా నీళ్లు అందిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని, కాంగ్రెస్ నాయకులు కూలిపోయిందని చేసిన దుష్ప్రచారం తెలిసిపోతుందని నీటిని ఎత్తడం లేదు అన్నారు.
Also Read:ప్రాసెస్డ్ ఫుడ్‌తో పెద్దపేగు క్యాన్సర్?
వీటిని ప్రజలకు చూపించి, ఇప్పటికైనా నీటిని లిఫ్ట్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కన్నెపల్లి పంప్ హౌసు సందర్శనకు బయలుదేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి.

